in

things keerthy suresh does when she is upset!

బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్‌ పూర్తిగా నిరాశ పరచింది. ఈ సమయంలోనే తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని,వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్‌ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్‌ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు..

ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చేసిన వాక్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ..ఒక్కోసారి నేను అప్‌సెట్‌ అవుతుంటాను. అప్పుడు ఏం చేస్తానో తెలుసా..ఫుల్‌గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళతాను. ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్‌ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్‌సెట్‌ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది అని కీర్తి సురేశ్‌ తెలిపింది..!!

Nithya Menen: Acting with Star Heroes is My Biggest Mistake