మహేష్ బాబు హెయిర్ సీక్రెట్ విగ్!
మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణకు, అలాగే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబుకు హెయిర్ లాస్ సమస్య ఉండేది. వారందరికీ వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోవడం మనం చూశాం. అలాంటి జెనెటిక్ సమస్య ఉన్నప్పటికీ, మహేష్ బాబుకు మాత్రం ఏమాత్రం జుట్టు ఊడిపోకుండా, పర్ఫెక్ట్ హెయిర్‌తో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఆయన హెయిర్ వెనుక ఏదో సీక్రెట్ దాగి ఉందని అందరూ నమ్ముతున్నారు..
అనేక ఊహాగానాలు, వార్తల ప్రకారం.. మహేష్ బాబు విగ్ వాడరని, కానీ దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన క్యూ6 టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ టెక్నాలజీలో నిజమైన జుట్టులా కనిపించే ప్యాచ్‌లను తల మీద ఫిక్స్ చేస్తారు. ఇవి అచ్చం ఒరిజినల్ జుట్టులాగే కనిపిస్తాయి. అందుకే మహేష్ బాబు తరచూ విదేశాలకు వెళ్లి ఈ ప్యాచ్‌లను సెట్ చేసుకుంటారని సమాచారం. ఈ టెక్నాలజీ వల్ల ఆయన ఏ సినిమాకు కావాలంటే ఆ సినిమాకు కొత్త హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతున్నారని అంటున్నారు..!!