చిత్ర పరిశ్రమ, ఒక విచిత్రమయిన పరిశ్రమ, ప్రతిభ ఉన్న కూడా, కొంత మంది గుర్తింపుకు నోచుకోరు, మరికొంతమంది మాత్రం తమ ప్రతిభకు మించి గుర్తింపు పొందుతుంటారు, దీనినే” పి.ఆర్.”( పర్సనల్ రిలేషన్) అంటారు సినీ పండితులు. కొంతమంది మాత్రం మంచి పి.ఆర్ కలిగి ఉండి వెలిగి పోతుంటారు, కేవలం ప్రతిభ, పి.ఆర్. ఉంటె చాలదు బాస్, కూసింత” లక్ ” కూడా ఉండాలి అంటారు మరి కొంత మంది సినీ పండితులు. మొత్తానికి టాలెంట్, పి.ఆర్. అండ్ లక్ ఈ మూడు కలిసి వచ్చిన వారు కొద్ది మందే ఉంటారు, ఒకటుంటే, ఒకటి లేక,కను మెరుగైన వారు చాలా మందే ఉంటారు, ఆ కోవకు చెందిన గత కాలపు నటి నగ రాజ కుమారి.1937 లో వచ్చిన దశావతారాలు చిత్రం తో వెండి తెరకు పరిచయం అయ్యారు మొదటి చిత్రం లోనే సీత, యశోద, లక్ష్మి పాత్రలను పోషించారు నగ రాజ కుమారి, ఆ రోజుల్లో నటీమణులు తక్కువగా ఉండటం వలన , ఒకరే రెండు, మూడు పాత్రలు చేయటం పరిపాటి . ఆ తరువాత హీరోయిన్ గ నాలుగు, అయిదు చిత్రాలలో నటించారు నగ రాజ కుమారి..
1940 లో, వాహిని వారి సుమంగళి చిత్రంలో నటించిన కుమారి వాహిని వారు తీయబోయే మరో మూడు చిత్రాలలో నటించేందుకు కాంట్రాక్టు లోకి వెళ్లారు. ఆ కాంట్రాక్టు పూర్తి కాకా ముందే వాహిని వారి అనుమతితో హిందీ చిత్రం లో నటించేందుకు బొంబాయి వెళ్లారు కుమారి, ఆరు నెలలు అక్కడే ఉండిపోయారు కుమారి కానీ, ఆ చిత్రం షూటింగ్ స్టార్ట్ కాలేదు, దానితో కుమారి గారి కేరీర్ లో అయిదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 1946 లో రీ ఎంట్రీ ఇచ్చిన కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు మళ్ళీ కెరీర్ లో గ్యాప్, మళ్ళీ 1950 లో “మాయ పిల్ల” అనే చిత్రంలో హీరోయిన్ గ “డ్యూయల్ రోల్ “చేసే అవకాశం వచ్చింది, ఆ పాత్ర కోసం కుమారి వాడిన కాస్ట్యూమ్స్ కి మంచి క్రెజ్ వచ్చింది. ఆ విధంగా నగ రాజ కుమారి మొట్ట మొదటి డ్యూయల్ రోల్ చేసిన హీరోయిన్ గ రికార్డు సృష్టించారు. పాపం ఆ చిత్రం కూడా విజయవంతం కాకపోవటం తో నిరాశ చెందారు. మెల్లగా కెరీర్ మసక బారింది, అడపా, దడపా మల్లీశ్వరి చిత్రం వరకు నటించారు. సినీ కెరీర్ అనుకున్నంత ఆశ జనకంగా లేక పోవడం తో, కుటుంబం తో బెజవాడ వెళ్లిపోయారు కుమారి. పూర్తి గ గృహిణిగా సెటిల్ అయి, యాభై ఏళ్ళ పాటు ప్రశాంత జీవితం గడిపి తన 87 వ ఏట మరణించారు..!!