in

malayali beauty Aparna Das makes her Telugu debut!

ప్పటికే అనేకమంది మలయాళీ భామలు, కన్నడ భామలు, తమిళ భామలు టాలీవుడ్ ని ఏలే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు ఒక మలయాళీ భామను మళ్లీ కొత్తగా దించారు. ఆమె పేరు అపర్ణ దాస్, ఎక్కువగా మలయాళ సినిమాల్లో అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కనిపించే ఆమె బీస్ట్ సినిమాలోని అపర్ణ అనే తన పాత్రకు అలాగే మలయాళంలో మనోహరం అనే సినిమా ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో హీరోయిన్గా ఎంపికైంది..

దీంతో పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే వైష్ణవ తేజ్ సరసన హీరోయిన్గా శ్రీ లీల ఎంపికైంది. ఇప్పుడు ఆమెతో పాటుగా అపర్ణ దాసుని కూడా రంగంలోకి దించారు మేకర్స్. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల్లోకి ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ను తీసుకొస్తున్న సంఖ్య గట్టిగానే పెరుగుతుంది.!!

THE FIRST HEROINE WHO PLAYED DUAL ROLE!

finally sai pallavi signs next under kamal hassan’s production!