in

thapsi gets the biggest chance in her film career!

రుస ఫ్లాపులతో అల్లాడుతున్న షారుఖ్ ఖాన్.. రెండేళ్ల విరామం తీసుకుని జాగ్రత్తగా కొత్త సినిమాలు లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ‘పఠాన్’ అతడి రీఎంట్రీ మూవీ కాగా.. దీంతో పాటు అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అతను రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘పఠాన్’ పూర్తి కాగానే అది మొదలవుతుంది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సిన నటించనుందట.

షారుఖ్ ఖాన్‌తో నటించడమే పెద్ద అవకాశం అంటే.. రాజ్ కుమార్ హిరాని లాంటి గ్రేట్ డైరెక్టర్ దానికి దర్శకత్వం వహించడమంటే తాప్సికి ఇది బంపర్ ఆఫర్ అన్నట్లే. బాలీవుడ్లో తాప్సి ఇప్పటిదాకా పెద్ద హీరోల సరసన సినిమాలు చేసింది లేదు. ఒకేసారి ఆమె ఇలాంటి పెద్ద చిత్రంతో స్టార్‌కు జోడీగా నటించబోతోంది. హిరాని సినిమాల్లో హీరోయిన్లకూ మంచి పాత్రలుంటాయి. అవి బాగా ఎలివేట్ అవుతాయి. ఈ వార్త నిజమే అయితే మాత్రం తాప్సి మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే.

2020 was the best year for me, says priyamani!

shruthi haasan gives an update on kamal haasan’s leg surgery!