నందమూరి వంశం నుంచి వచ్చిన రెండవ తరం నటుడు కల్యాణ చక్రవర్తి, అందమయిన ఆకారం, సహజం అయిన నటనతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ నటుడు హఠాత్తుగా వెండి తెర నుంచి మాయం అయిపో యాడు. 1988 లో సినీ రంగం ప్రవేశించిన నటుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, లంకేశ్వరుడు సినిమా తరువాత నటనకు స్వస్తి చెప్పారు. మన హీరోలు తెర మీద కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, నిజ జీవితం వేరు తెర మీద పాత్రలు వేరు, కానీ కల్యాణ చక్రవర్తి నిజ జీవితం లో కూడా హీరోనే అందుకే ఆయన స్వచ్చందం గ వెండి తెరకు దూరం అయ్యారు. తండ్రి త్రివిక్రమ రావు ఆరోగ్యం బాగోక చెన్నై అపోలో హాస్పిటల్ లో ఉన్నారు, కల్యాణ చక్రవర్తి కెరీర్ మంచి పీక్ లో ఉంది, దగ్గర ఉండి తండ్రిని చూసుకోవాలి, ఇంటికి పెద్ద కొడుకుగా అది తన బాధ్యత. తండ్రికి సపర్యలు చేస్తూ కొంత కాలం నటన కొనసాగించారు, ఇంతలో ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది, చెన్నై, హైదరాబాద్ మధ్య తిరుగుడు అతనికి ఇబ్బందిగా మారింది.
అప్పుడు ఆలోచనలో పడ్డారు కల్యాణ చక్రవర్తి తన కెరీర్ ముఖ్యమా లేక తండ్రికి సేవ చేయడం ముఖ్యమా అని ఆలోచించారు, మెదడు కెరీర్ అన్నది, ,మనసు బాధ్యత ముఖ్యం అన్నది, మనసు మాటకు విలువ ఇచ్చిన మనసున్న మంచి కొడుకు కల్యాణ చక్రవర్తి. తండ్రి కోసం తనకు వస్తున్న అవకాశాలను కాదనుకొని చెన్నై కె పరిమితం అయ్యి తండ్రిని చూసుకున్నారు, కానీ దురదృష్ట వశాత్తు తండ్రి మరణించారు. తండ్రితో చాల అనుబంధం ఉన్న కల్యాణ చక్రవర్తి ఆ సంఘటనతో కుంగిపోయారు, కోలుకోవడానికి చాల కాలమే పట్టింది. సినీ పరిశ్రమ కూడా ఆయనను మర్చిపోయింది, అయన కూడా సినీ పరిశ్రమ గురించి ఆలోచించటం మానేశారు. తండ్రి కోసం తన కెరీర్ ను ప్రక్కన పెట్టిన నిజ జీవితపు హీరో కల్యాణ చక్రవర్తి అని ఒప్పుకోక తప్పదు.,