in

Thandel director Chandoo announces a historical film with Naga Chaitanya!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా, దర్శకుడు చందు మొండేటి ఈ సందర్భంగా నాగచైతన్యతో మరో సినిమా అనౌన్స్ చేశారు..

గతంలో ANR నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు. “శోభిత గారూ..మీరు తెలుగు చక్కగా మాట్లాడతారు..ఆ తెలుగును మా హీరోకి (నాగచైతన్యకి) కూడా బదిలీ చేయండి. భవిష్యత్తులో మేం చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నాం. నాడు ఏఎన్నార్ నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ కు తగినట్టుగా తెరకెక్కిస్తాం” అని చందు మొండేటి వివరించారు. ఈ సినిమాలో నాగచైతన్య నటన చూసిన వారు మరో ఏఎన్నార్ అనుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు..!!

 

happy birthday jagapathi babu!

actress Rakul Preet Singh’s Emotional Return After Injury!