అందాల ముద్దు గుమ్మ తమన్నా భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ ఫిల్మ్ తో చక్కటి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే.. తాజాగా తమన్నా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ఆమె నటించిన బబ్లీ బౌన్సర్ కూడా బోల్తా కొట్టింది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ పెళ్లి, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి ఆలోచించలేదు అంతే. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. ఆమె లైఫ్ పార్ట్నర్ ఎవరో చూడాలి మరి.