in

Thaman walks out of Akhil Akkineni’s ‘Agent!

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. “ఏజెంట్” అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించడానికి ఎస్.ఎస్.తమన్ ను రంగంలోకి దింపారు దర్శకనిర్మాతలు. కానీ తాజా సమాచారం ప్రకారం థమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నరట.

#RC15, గాడ్ఫాదర్, మహేష్ బాబు28 వంటి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ “ఏజెంట్” సినిమా కోసం సమయాన్ని కేటాయించి లేక పోతున్నారట. అందుకనే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలతో చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో థమన్ బదులుగా హిప్ హాప్ తమిజా ను సినిమాకి సంగీతాన్ని అందించడానికి తీసుకున్నారు దర్శక నిర్మాతలు.”ధ్రువ” సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి తమీజా సంగీతాన్ని అందించడం ఇది రెండవ సారి.

Punam Kaur Sensational Comments On Drugs Issue!

RGV’S HEROINE APSARA RANI HOT PHOTOSHOOT!