in

Telangana police filed an FIR against rana, vijay, prakash raj

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన పలువురు సినీ నటులపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 318 (4), 112 ఆర్/డబ్ల్యు 49 బీఎన్ఎస్ సెక్షన్లు, గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3.3(ఏ), ఐటీ యాక్టులోని 66 డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు సహా యాంకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 11 మందిని విచారణకు రావాలని మార్చి 19న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా కొందరు పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు..!!

pushpa director Sukumar to work with Shah Rukh Khan?