తెలుగు అమ్మాయి బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేయద్దు అని చెప్పేదే ఈ సినిమా మెసేజ్. ఈ సినిమా రీయాలిటీ దగ్గర గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను.. మంచి స్కోప్ ఉన్న సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఒక ఫుడ్ పెట్టింది. నాకు ఒక దారి చూపించింది. ఈ రోజు మీ ముందు ఉన్నాను అంటే సినిమా ఇండస్ర్టీ కారణం. కానీ ప్రతి దాంట్లో గుడ్, బ్యాడ్ ఉంటుంది. నేను జర్నలిజం చేశాను సస్టైన్ అవ్వకనే నేను ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చాను. ఇండస్ట్రీ లో కి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు. మెంటల్ గా నేను స్ట్రాంగ్. కంటెంట్ నచ్చితే అడల్ట్ అయినా ఏది అయినా చేస్తాను.
రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయి. మూవీ లో RGV గారి బిట్ ఉంటుంది చూడండి నా లైఫ్ లో అలాగే జరిగింది. సినిమా కి ఎంత అవసరం అంత చేయాలి. నాకు బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను. నా పర్సనాలిటీ కి గుర్తింపు వచ్చింది కానీ నా నటనకి రాలేదు ఈ సినిమాతో వస్తుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో కి వెళితే కెరీర్ స్పాయిల్ అవుతుందని కొందరు అంటారు. కానీ నాకు అలాంటి ప్రాబ్లెమ్ ఏమి లేదు. కార్ కొన్నాను, ఇల్లు కొన్నాను. బిగ్ బాస్ కి వెళ్ళటం వలన నేను చాలా హ్యాపీ..”