in

TAXIWALA AVABOYI DIRECTOR AYINA RAHUL Sankrityan!

రాహుల్ సాంకృత్యాయన్ సినీ వినీలాకాశంలో మెరిసిన ఒక కొత్త మెరుపు, తన మేకింగ్ స్టైల్ తో వీడెవండీ బాబు అనిపించుకున్న దమ్మున్న డైరెక్టర్. సినీ నావకు కెప్టెన్ అయిన రాహుల్, ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్ అవ్వాలనుకున్నాడు. ఏమాత్రం సినీ నేపథ్యం లేని కుటుంబం, చదువు అయ్యాక చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఇమడలేక, తన గమ్యాన్ని వెదుక్కుంటూ, జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకొని, హైదరాబాద్ చేరాడు. తన ఫ్రెండ్ యువ చంద్ర నిర్మిస్తున్న, ” సూపర్ స్టార్ కిడ్నాప్” చిత్రం టీం మెంబెర్ గ చేరిపోయాడు. ఒక వేపు ఉద్యోగం, మరో వైపు తన కల రెండిటి మధ్య పరుగులో జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర బైక్ ప్రమాదం, రెండు కాళ్లు విరిగిపోయాయి. కళ్ళ ముందు అంతా శూన్యం, ఆ శూన్యం లో నుంచి ఓ వెలుగు రేఖ ఎప్పుడో తాను తీసిన ” చిత్ర ఐ లవ్ యు” షార్ట్ ఫిలిం కి ‘MAA” అసోసియేషన్ తరుపున ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ చిగురించిన కొత్త ఆశ. దుబాయ్ లో సెటిల్ అయిన మేన మామ నిర్మాతగా ” ది ఎండ్” అనే సినిమా తీసి రిలీజ్ చేసాడు,

మొదటి సినిమా పేరే ” ది ఎండ్”, అంటే ముగింపు నుంచి మొదలుకు ఎదురు ప్రయాణం అన్నమాట, ఆ టైం లోనే రజనీకాంత్ ” లింగ” సినిమా రిలీజ్ అయి రాహుల్ కలలకు ” ది ఎండ్” కార్డు వేసేసింది. అప్పటికే జాబ్ కి గుడ్ బై చెప్పిన రాహుల్ ఇక చేసేదేమి లేక భుక్తి కోసం స్టిల్ ఫోటోగ్రాఫర్ అవతారం, ఆదాయం అంతంత మాత్రం, అప్పుడే ఓలా, ఉబెర్ క్యాబ్లు హైదరాబాద్ రోడ్ల మీద పరిగెత్తటం మొదలుపెట్టాయి, ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని టాక్సీ రాముడిగా మారాలి అనుకున్న రాహుల్, కార్ల వేటలో పడ్డాడు, ఓ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వారి గోడౌన్ లో “టొయోట క్రిష్టా” కార్ చూసి రేట్ అడిగిన రాహుల్ కి మతి పోయింది, దాని రేటు రెండు లక్షలు చెప్పాడు, అంత మంచి కారు అంత తక్కువ రేటుకు ఎందుకు ఇచ్చేస్తున్నారు అనుకోని ఆలోచిస్తూ బయటకు వచ్చిన రాహుల్ లోని రచయిత మళ్ళీ జూలు విదిల్చి నిద్ర లేచాడు.

ఈ ప్రశ్న తో ఒక కామెడీ హర్రర్ సినిమా కధ పురుడు పోసుకున్నది, దానికి సూడో సైకాలజీ అంశం చేర్చి ఓ దెయ్యం కారు కథ రెడీ చేసుకొన్నాడు. శ్రీ శ్రీ గారు కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా, “సినిమా పిచ్చోడిని ఏడకి తొడక పోయిన సినిమా కూతే కూస్తడబ్బి” అని నిరూపించాడు. అదే రాహుల్ సాంకృత్యాయన్ ని డైరెక్టర్ గ నిల బెట్టిన సినిమా ” టాక్సీవాలా”, పరిశ్రమ అంత ఒక్కసారిగా ఉలిక్కిపడి వీడెవండండి బాబు అనుకున్నారు. మొత్తానికి టాక్సీ డ్రైవర్ అవుదామనుకున్న రాహుల్, ” టాక్సీవాలా” తో దమ్మున్న డైరెక్టర్ అనిపించుకుని, “శ్యాం సింగరాయ్” తో మీసం తిప్పాడు. అనుకున్నది చెయ్యలేక, చేసేది నచ్చక కొట్టుమిట్టాడే యువతకు స్ఫూర్తి రాహుల్ సాంకృత్యాయన్ కథ.ఎవడయినా దమ్మున్న డైరెక్టర్ అవ్వాలంటే రాహుల్ సాంకృత్యాయన్ కధని సినిమాగా తీసుకోండి.

telugu girl ritu varma stills in blue dress!

big update from ‘ghani’, Tamannah returns to the dance floor!