in

Tabu and Nagarjuna Reunites After 28 Years of Gap!

నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోనున్న 100వ చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు స్వయంగా ఆమే తెరదించారు. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సోషల్ మీడియా ఖాతాలో మూవీ క్లాప్‌బోర్డు ఫొటోను షేర్ చేసి, ఊహాగానాలకు ముగింపు పలికారు. చిత్ర యూనిట్ అత్యంత గోప్యంగా చిత్రీకరణ జరుపుతుండగా, టబు పోస్ట్‌తో ఈ విషయం తొలిసారిగా బయటకు వచ్చింది..

టబు పోస్ట్‌పై దర్శకుడు రా. కార్తీక్ స్పందిస్తూ, “మేడమ్, మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని కామెంట్ చేశారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో గతేడాది అక్టోబరులోనే ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. దాదాపు 28 ఏళ్ల క్రితం ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో నాగార్జున, టబు జంట టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా నిలిచింది..!!

bold beauty dimple hayathi to play a negative role?

Item Song: Shruti Haasan Charges More Than Sreeleela!