ఇది చదవగానే బాలీవుడ్ ఏంటి? రాహుల్‌గాంధీ ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను అక్కడి నటి స్వర భాస్కర్.. కాంగ్రెస్ నేత రాహుల్‌తో పోల్చింది మరి. ఇండియా టుడేతో మాట్లాడిన ఆమె.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పరిస్థితి ఇలా అయిపోయిందని అభిప్రాయపడింది. దీని వెనుక ఉన్న కారణాలను ఆమె చెప్పుకొచ్చింది. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణమని ఆమె చెప్పడం విశేషం. థియేటర్లలో షోలు రద్దవడానికి బాలీవుడ్ కారణం కాదని స్వర భాస్కర్ అంటోంది.
ఇందులో ఓటీటీల పాత్ర కూడా ఉన్నదని చెప్పింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌పై ద్వేషం పెరిగిపోయిందని, అది ఇంకా కొనసాగుతోందని స్వర అభిప్రాయపడింది. ఇక బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోనూ ఆమె పోల్చింది. “ఇది చాలా వింత పోలికగా మీకు అనిపించవచ్చు. కానీ నాకు రాహుల్ గాంధీ గుర్తొస్తున్నారు. ఆయనను అందరూ పప్పూ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడందరూ అదే నమ్ముతున్నారు..!!