in

Lakshmi Manchu Nominated To 100 Most Beautiful Faces Global List!

ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. నిత్యం వార్తల్లో ఉంటారు. ఆమె మాటలకు ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముద్దు ముద్దు మాటలతో మంచు లక్ష్మీ ట్రోలర్స్‌కు బోలెడంత పని కల్పిస్తుంటారు. మంచు లక్ష్మి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడప్పుడు ఆమె తన జిమ్ ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తుంటారు. అయితే, ఈ సారి ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అతికొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని లక్ష్మీ దక్కించుకున్నారు.

టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్ ప్రతి సంవత్సరం 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి ఈ లిస్టుకు నామినేట్ అయ్యారు. ఇండియాలో 100 అత్యంత అందమైన ముఖాలు (100 most beautiful faces) జాబితాకు లక్ష్మీ నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని లక్ష్మి స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఆమెను నామినేట్ చేసిన పాట్రియోన్ సంస్థకు ధన్యవాదాలు చెబుతూ లక్ష్మీ ఈ పోస్టు పెట్టారు..!!

Swara Bhasker compares Bollywood’s situation to Rahul Gandhi!

ram’s ‘The Warrior’ director Lingusamy gets 6 months jail sentence!