in

‘svp’ director Parasuram confirms movie with Naga Chaitanya!

స‌ర్కారు వారి పాట సినిమా స‌క్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న‌ ప‌ర‌శురాం యువ హీరో నాగ‌చైత‌న్య‌ తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి ఫిలినగ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా క‌థ చైతూ తాత అక్కినేని నాగేశ్వ‌ర్ రావుతో క‌నెక్ట్ అయి ఉండబోతుంద‌ట‌. అంతేకాదు ఈ సినిమాకు నాగేశ్వ‌ర్ రావు అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట ప‌ర‌శురాం..

దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఏం లేకున్నా..ఈ క్రేజీ న్యూస్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇదే డైరెక్ట‌ర్‌తో ధూత అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈప్రాజెక్టులో పార్వ‌తి తిరువొతు, ప్రియా భ‌వాణి శంక‌ర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌రోవైపు దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ న‌టిస్తోన్న లాల్ సింగ్ ఛ‌ద్దాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 14 రీల్స్ బ్యాన‌ర్‌లోనే చైతూ-ప‌ర‌శురాం సినిమా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోండ‌గా..దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Actress Harini hot Navel & Cleavage Show Stills!

Kamal Haasan to play villain in Jr NTR-Prashanth Neel film?