
వెండి తెర హీరోలు చాలా మంది ఉంటారు, వెండి తెర మీద నిజ జీవితం లో కూడా హీరోలుగా ఉండే వారు కొద్దీ మందే ఉంటారు. నిజ జీవితం లో ఎన్నో సాహసాలు చేసిన వారికీ కూడా అంతగా గుర్తింపు వచ్చే అవకాశాలు తక్కువ గ ఉండేవి, ఇప్ప్డుడు సోషల్ మీడియా పుణ్యమా అని కొంత గుర్తింపు వస్తుంది. హీరో కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గ మంచి గుర్తింపు ఉన్న నటుడు, అందుకు కారణం తెర మీద అయన చేసిన పాత్రలు అయన చేసిన ప్రయోగాలు.కానీ నిజ జీవితం లో కూడా ఆయన డేరింగ్ హీరో గ నిరూపించుకున్న ఒక సంఘటన జరిగింది. ఒక రోజు అర్ధ రాత్రి ఒక దొంగ వారి ఇంటిలోకి ప్రవేశించి విజయ నిర్మల గారికి కత్తి చూపించి బెదిరించటం మొదలు పెట్టాడు, బెదిరి పోయిన విజయ నిర్మల గారు గట్టిగ కేకలు వేయటం మొదలు పెట్టారు, కేకలు విన్న కృష్ణ గారు బెడ్ రూమ్ లోనుంచి బయటకు వచ్చి చూసి, బెదిరిపోలేదు దొంగ ను పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ క్రమం లో వాడి కి నాలుగు తగిలించి, వాడి చేతిలోని కత్తి క్రింద పడిపోయే లాగా చేసారు, ఇదే అదనుగా కృష్ణ గారు వాడిని ఒడిసి పట్టుకొని, కదలకుండా చేసి వాడిని ఒక కుర్చీ కి కట్టిపడేసారు.బిత్తర పోయిన దొంగ కిక్కురు మనకుండ ఉండిపోయాడు, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి వాడిని పోలీస్ వారికి అప్పగించారు కృష్ణ గారు.ఇదే సీన్ లో ఇంకెవరయినా అయితే , మారు మాట్లాడకుండా దొంగ కు అడిగినవి సమర్పించి, ప్రాణాలు దక్కించుకునే వారు, కానీ మన డాషింగ్ హీరో గారు మాత్రం అందుకు భిన్నంగా ప్రాణాలకు తెగించి, పోరాడి మరి వాడి అట కట్టించ, అందుకే కృష్ణ గారు రియల్ డాషింగ్ డేరింగ్ హీరో.
