ఫ్యాన్స్ కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో కోరిక ఉంటుంది, తీరా వారు కలిసి నటించాక.. స్క్రీన్ మీద వారి జోడి పర్వాలేదని అనిపించిన..సినిమాలు మాత్రం ప్లాప్ అవుతున్నయి,
అల్లు అర్జున్ కాజల్ జంట మీద భారీ అంచనాలు ఉన్న సమయంలో ఇద్దరి కలిసి ‘ఆర్య 2 ‘ చేసారు, కానీ చివరకు ప్లాప్ గ నిలిచింది ఈ సుకుమార్ సినిమా. మిల్కీ బ్యూటీ తమన్నా, రామ్ చరణ్ కలిసి నటించిన రచ్చ సినీమా అసలు ఏమాత్రం రచ్చ చేయలేకపోయింది. రష్మిక, విజయ్ దేవరకొండ కల్సి నటించిన గీత గోవిందం హిట్ అయినప్పటికీ ఇదే కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ గోరంగా ప్లాప్ అయ్యింది. పోకిరి సినిమాతో యూత్ మతిపోగోట్టిన ఇలియానా , ప్రభాస్ తో చేస్తే బాగుంటది అని ఎంతగానో వెయిట్ చేసారు ఫ్యాన్స్, ఫ్యాన్స్ కోరిక తీరుస్తూ ‘మున్నా’ సినిమా చేసారు ప్రభాస్, ఇలియానా, కానీ సినిమా డిజాస్టర్ గ నిలిచింది. ప్రభాస్, అనుష్క ఒకరికి ఒకరు ఆన్ స్క్రీన్ మీద బాగా సెట్ అయ్యే జోడి, ఇద్దరు కలిసి ముందు ‘బిళ్ళ’ సినిమా చేసారు.. అది ప్లాప్ టాప్ తెచ్చుకుంది, కానీ ఇద్దరు కలిసి చేసిన మిగతా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
చిరంజీవి ,సిమ్రాన్ కల్సి మృగరాజు మూవీ చేసారు. అప్పట్లో యూత్ కి కలలరాణిగా సిమ్రాన్ ఉంది. కానీ ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పవన్ కళ్యాణ్ , త్రిష కల్సి బంగారం మూవీ చేసారు. అప్పట్లో తిరుగులేని హీరోయిన్ గా త్రిష రాణిస్తోంది. అందుకే ఈ ఇద్దరు జోడిగా సినిమా రావాలని ఫాన్స్ కోరుకున్నారు. కానీ బంగారం మూవీ నిరాశ పరిచింది. ఆతర్వాత తీన్ మార్ మూవీ చేసినా ఫలితం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ ,హన్సిక కల్సి మెహర్ రమేష్ డైరెక్షన్ లో కంత్రీ మూవీలో చేసారు. ఆసమయంలో హన్సిక క్రేజ్ అదిరిపోతోంది. దీంతో ఫాన్స్ ఎక్కువగా అంచనాలు వేసుకున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిన ,సినిమా తీవ్ర నిరాశ పరిచింది. ఖలేజా మూవీలో అనుష్క ,మహేష్ కల్సి నటించారు. ఇద్దరి రొమాన్స్ ఫాన్స్ బానే ఎంజాయ్ చేసినా, సినిమా ప్లాప్ అయింది.