పూజా నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు..ఈ క్రమంలో హరీష్ శంకర్ సైతం పవన్ సరసన పూజా హెగ్డేని నటింపజేయాలని బలంగా డిసైడ్ అయ్యారు. హరీష్ పవన్ కల్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్అనే సోషల్ డ్రామా/పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించమని పూజా హెగ్డేని హరీష్ తాజాగా కోరారు. అయితే పూజా హెగ్డే పవన్ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపినట్టు హరీష్‌శంకర్ ప్రకటించారు.
కానీ పవన్ సినిమా విషయంలో ఆమె కాస్త వెనకడుగు వేస్తోంది. దీనికి కారణం పవన్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు బిజీ అవుతారో తెలియదు. ఆయన బిజీగా లేకపోతే ఇప్పటికే హరీష్‌శంకర్ తో సినిమా స్టార్ట్ అయ్యి సగం షూటింగ్ పూర్తి చేసుకుని ఉండేది. కానీ అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో పవన్ షూటింగ్ కు ఎప్పుడొస్తారు? అతనితో కలిసి ఎప్పుడు నటించాలి? కాల్ షీట్స్ ఇప్పుడు ఇవ్వాలి? అనే సందేహాలను పూజా వ్యక్తం చేస్తోంది.
దీనిపై హరీష్ శంకర్ కూడా క్లారిటీగా సమాధానం ఇవ్వలేక పోతున్నారు. దాంతో ఆమె పవన్ అయితే ఏంటి? కేవలం ఒక సినిమా కోసం మిగతా అన్ని సినిమాల కాల్షీట్స్ పాడు చేసుకోలేను.. సరైన డేట్స్ కేటాయించేంత వరకు ప్రాజెక్ట్ కి సంతకం చేసే ప్రసక్తే లేదు.. అని ఆమె సున్నితంగా చెప్పినట్లు సమాచారం. రెండు నెలల తర్వాత హరీష్ శంకర్ డేట్స్ కోరితే ఆమె తన డేట్స్ సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని వినికిడి.