in

sunil bags 2 pan india movies from tollywood!

కప్పుడు కమెడియన్ గా రాజవైభోగం అనుభవించిన సునీల్ హీరోగా మారిన తర్వాత హిట్స్ అందుకున్నా కానీ క్రేజ్ ను కోల్పోయాడు. ఇక సునీల్ హీరోగా ప్లాపులు వచ్చిన తర్వాత విలన్ గా, కమెడియన్ గా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా వాటికి వచ్చిన రెస్పాన్స్ అంతంతమాత్రమే. అయితే సడెన్ గా సునీల్ కెరీర్ టర్న్ అయింది. దీనికి కారణాలు తెలియదు కానీ వరసగా టాప్ ప్రాజెక్టులను సైన్ చేస్తున్నాడు సునీల్. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పుష్పలో సునీల్ ఒక విలన్ గా నటిస్తున్నాడు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లో సునీల్ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. ఈ భారీ సినిమాలో సునీల్ కు అవకాశమొస్తుందని ఎవరూ పెద్దగా ఊహించలేదు. ఈసారి విలన్ కాకుండా రామ్ చరణ్ పక్కనే ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు సునీల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని సినిమాలను సైన్ చేయాలని చూస్తున్నాడు. మరి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ మునుపటి స్థాయిలో బిజీ అవుతాడా?

Ravi Teja turns detective for his next!

telugu girl tejaswi madiwada latest stills!