కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఉంటున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ విధించాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా కరోనా బాధితులకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టి , తన మంచి మనసును చాటుకున్నారు.
కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటాననీ , వారి బాధ్యత ను తాను తీసుకుంటాననీ , తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఉంటే వారి వివరాలను [email protected] కు తెలియజేయండనీ , రెండు సంవత్సరాల పాటు వారికి కావలసిన తిండి, చదవు, ఇతర అవసరాలన్నీ సమకూర్చుతాననీ , ఇలాంటి సమయంలో ఒకిరికి ఒకరం అండగా నిలబడాలనీ , కుదిరితే కొంత సాయం చేయండనీ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.