in

SUMITRA GARI PRANALU KAPADINA KING NAGARJUNA!

శాంత కుట్టి, మలయాళీ కుటంబం లో జన్మించి , విశాఖపట్నం లో పెరిగి 13 ఇయర్స్ ఏజ్ లోనే సినిమా లో నటించి, 1980 వ దశకం లో హీరోయిన్ గ, సుమిత్ర గ పేరు మార్చుకొని, క్యారెక్టర్ నటిగా కోనసాగుతున్నారు. ఒక షూటింగ్ సందర్భం లో నాగార్జున గారు సుమిత్ర గారి ప్రాణాలు కాపాడారు.ఎలా, ఏమిటి ఆ కథ, ఏ షూటింగ్ లో జరిగిందో తెలుసుకోవాలని వుందా? అయితే చదవండి. గీతాంజలి సినిమా లో నాగార్జున గారి తల్లిగా నటించారు సుమిత్ర గారు,కాన్సర్ తో బాధపడుతున్న హీరో, కుటుంబానికి దూరంగా ఊటీ లో ఉంటున్న సమయం లో, అతనిని ఒక సారి చూడాలని తల్లి అక్కడకు వెళుతుంది. ఆమెను ఓదార్చి, తిరిగి ఊరికి పంపించే సీన్ షూటింగ్ జరుగుతుంది, రైల్వే స్టేషన్ లో సుమిత్ర గారిని ట్రైన్ ఎక్కించే సీన్, వర్షం పడుతుంటుంది, ఆమెతో మాట్లాడుతున్న నాగార్జున గారు, కదులుతున్న ట్రైన్ లో ఆమెను ఎక్కిస్తారు, ట్రైన్ ఎక్కేటప్పుడు సుమిత్ర గారి కాలు జారుతుంది, అమ్మ జాగర్త అంటూ నాగార్జున గారు ఆమెకు సహాయం చేసి ఎక్కించేస్తారు.ఈ సీన్ లో నిజంగానే సుమిత్ర గారు ట్రైన్ ఎక్కేప్పుడు కాలు జారీ పడిపోబోయారట, నాగార్జున గారు ఎంతో సమయస్ఫూర్తి తో ఆమెను పట్టుకొని లోపలికి, నెట్టివేశారట, సీన్ కంటిన్యూ అయిపొయింది, లేకుంటే ఎంత దారుణం జరిగివుండేదో ఒక్క సారి ఊహిస్తే గుండె వేగంగా కొట్టుకొంటుంది. ఆ మూవీ మీరు మళ్ళీ, చూసినప్పుడు గమనిస్తే మీకే క్లియర్ గ తెలుస్తుంది.

anasuya’s counter to a netizen!

happy birthday lakshmi!