in

Sumanth responds to his wedding rumors with mrunal thakur

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హీరో సుమంత్ సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని, వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సుమంత్, మృణాల్ చాలా క్లోజ్‌గా సోఫాలో కూర్చుని దిగిన ఓ ఫోటో లీక్ కావడంతో దాన్ని పోస్ట్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వీరు ఇద్దరూ స్పందించకపోవడంతో ఈ వదంతులు మరింత పెరిగాయి..

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్‌పై సుమంత్ స్పందించారు. మృణాల్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మృణాల్‌తో తనకు అసలు ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో విషయంపై క్లారిటీ ఇస్తూ..ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని అన్నారు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారని అన్నారు. సీతారామం తర్వాత ఇద్దరం కలుసుకున్నదీ లేదన్నారు..!!

Young sensation kayadu lohar in Nani’s Next!

Samantha says she was surprised to be offered ‘Oo Antava’ song!