సుమన్ గారి డేట్స్ దొరకకపోవటం తో హీరోగా తెలుగులో అవకాశం దక్కించుకున్న డాక్టర్ రాజా శేఖర్, పాతిక సంవత్సరాల తరువాత తాను నటిస్తూ నిర్మించిన చిత్రంలో సుమన్ గారికి అవకాశం ఇచ్చారు. టీ. కృష్ణ గారి డైరెక్షన్ లో సుమన్ గారు వరుసగా రెండు సినిమాల్లో నటించారు కమర్షియల్ చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ సుమన్ హీరో గ స్థిర పడ్డారు. టి,కృష్ణ గారి డైరెక్షన్ సుమన్ గారికి మూడో సినిమా అయిన “వందేమాతరం” చిత్రం కోసం సుమన్ గారి డేట్స్ కోసం ప్రయత్నించగా అప్పటికి బిజీ గ ఉన్న సుమన్ గారు డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం తో,
టి.కృష్ణ గారు అప్పుడే తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన డాక్టర్. రాజా శేఖర్ ను ఆ పాత్రకు తీసుకున్నారు ఆ చిత్రం విజయవంతం కావటం తో రాజా శేఖర్ తెలుగులో వరస అవకాశాలు దక్కించుకున్నారు,” అంకుశం” సినిమా తో తెలుగు హీరో గ స్థిరపడిపోయారు. కాల క్రమంలో సుమన్ గారు హీరో అవకాశాలు తగ్గటం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ స్థిర పడ్డారు., అప్పటికి హీరోగా కోన సాగుతున్న రాజా శేఖర్ గారు” ఆప్తుడు “అనే చిత్రం నటిస్తూ, నిర్మించిన సందర్భం లో ఒక ప్రత్యేకమయిన పాత్ర కోసం సుమన్ గారిని సంప్రదించి, ఆ పాత్ర ను సుమన్ చేత చేయించారు.