in

Sukumar to produce ‘Rowdy Boys’ hero next!

దిల్ రాజు మాట్లాడుతూ..రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు సంక్రాంతి బరిలో విడుదలై అందరి అభినందనలు అందుకుంటుంది. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడుతుంది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. రెండో వారంలో ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది. ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు.

అతడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను ఎంచుకున్నాం. భవిష్యత్తులో అతడు మంచి కథలు ఎంచుకునేలా చూసే బాధ్యత నాపై ఉంది. దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తుంది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఈ నిబంధనను మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. కరోనా భయాలు పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌చేసే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో గురువారం నుంచి వసూళ్లు పెరుగుతాయనే నమ్మకముంది. ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి సెల్ఫిష్ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సుకుమార్ సంభాషణలను అందించనున్నారు. ఆర్య తర్వాత నేను, సుకుమార్‌తో కలిసి చేస్తున్న చిత్రమిది. అందువల్లే బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు దిల్ రాజు.

Popular actress nikki galrani gets robbed, files a complaint!

Vaibhavi Joshi at ‘Guntur Talkies 2’ Movie Opening!