పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో బిగ్ బడా హీరోతో మరో బిగ్ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సుకుమార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన ఫస్ట్ మూవీ “జగడం”. రామ్ పోతినేనితో ఈ సినిమాని తరికెక్కించాడు సుకుమార్. నిజానికి ఈ సినిమాను మహేష్ బాబుతో లేదా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . దిల్ రాజు అదే పనిగా వాళ్ళిద్దరూ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేశారట. సుకుమార్ జగడం కథను వాళ్లకు వివరించగా కొన్ని సీన్స్ మార్చమంటూ సజెస్ట్ చేశారట.
అయితే అప్పట్లో సుకుమార్ చాలా మొండిగా ఉండేవాడు.. తాను రాసుకున్న సీన్స్ చేసే ప్రసక్తే లేదు అంటూ చెప్పేశాడు.. దీంతో అల్లు అర్జున్ – మహేష్ బాబు ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేశారు. దిల్ రాజు నేను మాట్లాడతాను ఆగు అని చెప్పినా కూడా వినకుండా సుకుమార్ ఎవరికి చెప్పకుండా దిల్ రాజు మాటలని లెక్కచేయకుండా రాత్రికి రాత్రి రామ్ పోతినేనితో ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. తెల్లవారుజామున షూటింగ్ స్టార్ట్ చేశారట. ఇది తెలుసుకున్న దిల్ రాజు..సుకుమార్ ని గట్టిగా అరిచారట..” కొంచమైనా బుద్ధుందా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా..? నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి ..కానీ ఇలా చేస్తావా అంటూ ఫైర్ అయిపోయారట..!!