in

sukumar initially wanted a telugu girl for ‘pushpa’!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను ఆల్ టైం హిట్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు.  ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టాలని అర్జున్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను కూడా అదే తరహాలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా రష్మికను అనుకోలేదంట.

ఈ విషయాన్ని తాజాగా సుకుమార్ ఓ మీటింగ్‌లో చెప్పారు. మొదటగా పుష్ప సినిమాకు ఓ తెలుగు అమ్మాయిని ఓకే చేశారంట. అందుకు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కానీ కొన్ని కారణాల కారణంగా ఆ అమ్మాయి సినిమా నుంచి తప్పుకున్నట్లు సుకుమార్ తెలిపారు. అప్పుడు రష్మికను ఓకే చేశారని సుకుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తదుపరి సినిమాలో తప్పకుండా తెలుగు అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకుంటానని కూడా అన్నారు.

‘Bigg Boss’ Harika appointed as Telangana tourism ambassador!

Kriti Sanon almost falls to the ground before posing for paparazzi!