
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్టై[/qodef_dropcaps] లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అల వైకుంఠపురంలో’, సరిలేరు నీకెవ్వరూ రెండు చిత్రాలు వచ్చే సంక్రాంతి కానుకగా రిలీస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోను గట్టి పోటీ ఉంటుందన్న విషయం రుజువైంది. తాజా సమాచారం ప్రకారం, బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.19.50 కోట్లకు అమ్ముడుపోగా, మహేష్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులను రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేశారట. దీనిబట్టి చూస్తుంటే సూపర్ స్టార్ కంటే స్టైలిష్ స్టార్ కె ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని తెలుస్తుంది. మరి ఈ రెండు చిత్రాలు అక్కడి వారిని ఎంతలా అలరిస్తాయో వేచి చూడాలి.