హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు మాధవ్ 2019 సెప్టెంబర్ 25 చనిపోయారు. కేవలం 49 ఏళ్ళకే వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ చనిపోయి రెండేళ్ళవుతుంది. అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్. 2006లో ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
ఇప్పటికీ ఏదైనా సినిమాలో ఈయన కామెడీ వచ్చినపుడు మనసారా నవ్వుకుంటారు..2019 సెప్టెంబర్ 25 న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన తన చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలు వెళ్లిపోయాడు. ఆ రోజుల్లో తన సొంత నియోజకవర్గం అయిన కోదాడ నుండి టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని అనుకునే వారట. ఇది ఆయన మనసులో చివరి వరకు ఉన్న కోరిక అని తర్వాత తెలిసింది టీడీపీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యాలి అని ఆ ప్రయత్నంలో భాగంగానే 2014 లో నామినేషన్ కూడా వేశాడు. అయితే వివిధ కారణాల వలన నామినేషన్ మళ్లీ వెనక్కు తీసుకున్నాడు. ఏది ఏమైనా తన చివరి కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపొవడం చాలా బాధాకరం.