‘బాహుబలి’ ను రిజెక్ట్ చేసిన శ్రీదేవి!
భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రను దివంగత నటి శ్రీదేవి ఎందుకు బాహుబలి రిజెక్ట్ చేశారనే టాపిక్ పై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెరదించారు. శ్రీదేవి భారీ డిమాండ్లు చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘బాహుబలి’ పై స్పందించిన బోనీ కపూర్!
బోనీ కపూర్ మాట్లాడుతూ, “రాజమౌళి గారు మా ఇంటికి వచ్చి శ్రీదేవికి కథ వివరించారు. ఆయనపై మాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన వెళ్లిపోయిన తర్వాత, నిర్మాతలు పారితోషికం విషయం ప్రస్తావించారు..అప్పటికే ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన శ్రీదేవికి, ఆ సినిమా కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు.
శ్రీదేవి అప్పటికే ఒక స్టార్, ఆమె ఏమీ సమస్యల్లో ఉన్న నటి కాదు. ఆమె పేరుతో సినిమాకు హిందీ, తమిళ మార్కెట్లలో ప్రచారం లభిస్తుంది. అలాంటప్పుడు ఆమెను అంత తక్కువ చేసి ఎందుకు అడగాలి?” అని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం బాహుబలి రిజెక్ట్ చేశామని తమను అవమానించినట్లుగా అనిపించిందని ఆయన స్పష్టం చేశారు..!!