
రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్ గ 107 నాట్ అవుట్, వయసు రీత్యా 78 స్టిల్ యంగ్ ఎట్ హార్ట్ అని చెప్పటానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన “దేవత” సినిమా లోని “ఎల్లువొచ్చి గోదారమ్మ” అనే పాట లో చుట్టూ బిందెలు పెట్టి శోభన్ బాబు, శ్రీ దేవి మీద చిత్రీకరించారు. అప్పట్లో ఆ పాట సూపర్ డూపర్ హిట్, ఆ పాటను ఇటీవల వచ్చిన వరుణ్ తేజ్ సినిమా” గద్దలకొండ గణేష్” చిత్రంలో, అదే తరహాలో బిందెలతో షూట్ చేసారు ఈ పాట కూడా ప్రేక్షకులను విశేషం గ ఆకర్షించింది. ఈ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ ను అభినందించడానికి స్వయంగా అయన ఆఫీస్ కు వెళ్లిన రాఘవేంద్ర రావు గారు, డైరెక్టర్ ను అభినందించి, ఆ పాట చిత్రీకరణలో హీరోయిన్ తన నడుము మీద పెట్టుకున్న బిందె ఒక సారి తెప్పించమని అడిగారట, అర్ధం కానీ డైరెక్టర్ ఆ బిందెను తెప్పించారట, దాన్ని శ్రీదేవి గారి జ్ఞాపకంగా తాను దాచుకుంటాను అని, ఆ బిందె తనకు ఇవ్వమని అడిగి మరి దాన్ని తనవెంట కారులో పెట్టుకొని తీసుకొని వెళ్లారట. శ్రీదేవి గారు ఇటీవల మరణించిన విషయం అందరికి తెలిసిందే, ఆమె గుర్తుగా, ఆ పాట సృష్టించిన సంచలనానికి జ్ఞాపకంగా ఆ బిందె ను తన దగ్గర పెట్టుకోవటం ఒకింత బాధ కలిగించిన, ఆ బిందె ఒక మధుర జ్ఞాపకానికి చిహ్నం కావటం విశేషం.

