
నేటి పరిస్థితులలో భార్య భర్తల మధ్య గొడవలు చాలా కామన్ అయిపోయాయి…అయితే అలాంటి గొడవలను తీర్చడానికి నేను సిద్దంగా ఉన్నాను అంటున్న ప్రముఖ టీవీ వ్యాఖ్యాత శ్రీముఖి. కానీ ఇది మిగతా షోలు లాగ సీరియస్ గా కాకుండా తన కామెడీ తో అలరించింది ఈ బిగ్ బాస్ షో స్టార్ శ్రీ ముఖి.యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ కార్యక్రమం ఒక స్పూఫ్ లాంటిది అని చెప్పొచ్చు.ఈ షో లో శ్రీముఖి హోస్ట్‌గా జబర్దస్త్ అవినాష్, యాంకర్ విష్ణు ప్రియ భార్యభర్తలుగా కనిపించారు. లాక్‌డౌన్ ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు కాస్త వినోదాన్ని అందించేందుకు ఈ స్ఫూఫ్ వీడియో రూపొందించింది శ్రీముఖి. కామెడీని అందిస్తూనే భార్యభర్తలిద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి గొడవలు రావని సందేశం ఇచ్చారు. హైలైట్ ఏంటంటే.. ఈ వీడియోను శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి షూట్ చేశారు.

