
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. అయితే తండ్రి మాట ప్రాకారం సినిమాలు చాలా వరకూ తగ్గించాను అని తెలిపిన ఈ బ్యూటీ తన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శ్రీముఖి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఆన్లైన్ లైవ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… ‘ చిన్నప్పుడు నేను ఎక్కువగా బలపాలు తినేసేదాన్ని. ఇందుకు గాను నాకు ఆ స్లేట్ పెన్సిల్ స్ ప్యాకెట్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. నేను ఇప్పటికీ వారి గుర్తుగా దాచుకున్నాను. ఇక నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు… నాకు నోటి దూల ఎక్కువ ఉండేది. నామినేషన్స్ లో ఉన్నవారు… ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పేదాన్ని. దాంతో గొడవలు అయ్యేవి. అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

