in

sam following nayan and anushka!

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అనిపించుకోవడం కన్నా సోలోగా సత్తా చాటాలని తాపత్రయపడే నాయికామణులు ఉన్నారు. వారిలో చెప్పుకోవాల్సి వస్తే నయనతార.. ఆ తర్వాత స్థానంలో అనుష్క వస్తుంది. సౌత్ సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ గా ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న వారిలో ఈ ఇద్దరే కనిపిస్తారు. ఈమధ్య త్రిష అలాంటి ప్రయోగాలే చేసినా.. అంతగా విజయాలు అందుకోలేదు. ఇక తాజాగా అక్కినేని కోడలు సమంత ఆ పంథా కొనసాగించాలని చూస్తుంది. ఫీమేల్ లీడ్ సినిమాలను చేసేందుకు సమంత బాగా ఆసక్తి కనబరుస్తుంది. అదే తరహాలో టాలీవుడ్ లో కూడా సమంత అలాంటి ఇమేజ్ కోసం పాకులాడుతున్నట్లుగా తెలుస్తోంది

అందులో భాగంగానే సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ను చేస్తుంది..
యు టర్న్, ఓహ్ బేబీ, సినిమాలతో సోలో హిట్స్ కొట్టింది ఈ అక్కినేని వారి ముద్దుల కోడలు.. స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సమంత పెళ్లి తర్వాత మరింత జోరు పెంచింది. ఇప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తూ.. తెలుగులో ఏ హీరోయిన్ చేయని సాహసాలు చేస్తుంది. ఒక పక్క గ్లామర్ రోల్స్ చేస్తూనే సమంత ప్రయోగం అంటే చాలు పరుగులు తీస్తుంది. సమంత ఉత్సాహం చూస్తుంటే నయనతార ఇంకా అనుష్క ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పరచుకుందో సోలోగా సమంత కూడా అలాంటి క్రేజ్ కోసమే పాకులాడుతున్నట్లుగా అర్ధం చేసుకోవచ్చు.

rana’s engagement with miheeka today!

are you a real young tiger fan?