
క్రికెటర్ తిలక్ వర్మతో స్టార్ హీరోయిన్ శ్రీలీల డేటింగ్‌లో ఉన్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హీరోయిన్ తల్లి స్వర్ణలత రియాక్ట్ అయ్యారు. శ్రీలీల పెళ్లికి చాలా టైం ఉందంటూ ఈ రూమర్స్‌ను ఖండించారు. ఈ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని..అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని తెలిపారు శ్రీలీల తల్లి. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వార్తలు పూర్తిగా అవాస్తవం నిరాధారం. ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు. ఇందులో కొంచెం కూడా నిజం లేదు.
శ్రీలీల ప్రస్తుతం తన చదువు, యాక్టింగ్‌లో బిజీగా ఉంది. ఏ మాత్రం కొంచెం గ్యాప్ దొరికినా NEET PG కి ప్రిపేర్ అవుతోంది. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఆలోచించడానికి ఆమెకు మరో ఐదారేళ్లు టైం ఉంది.’ అని చెప్పారు. 2025లో డిసెంబరులో శ్రీలీల – తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం, వాంఖడే టీ 20 మ్యాచ్‌లో హీరోయిన్ సందడి చేయడం..రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని స్పష్టం చేశారు. గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. అప్పుడు కూడా తల్లి స్వర్ణలత వాటిని ఖండించారు. బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చాయి..!!
