in

sreeleela was the second choice for ‘robinhood’!

నితిన్‌, శ్రీలీలన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరోయిన్‌ శ్రీలీలా విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నిజానికి ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమెకు డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడంతో ఈ అవకాశం తనకు వచ్చిందని శ్రీలీలా చెప్పుకొచ్చింది. కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఓకే చెప్పానని తెలిపింది. ఇక గతేడాది వరుసగా సినిమాల విడుదలతో చాలా బిజీగా గడిచిందన్న బ్యూటీ, రోజుకు 4-5 షిఫ్ట్‌ల వరకు పని చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది. అయితే మెడిసిన్ ఫైనల్ ఇయర్‌ పూర్తయ్యే సమయానికి ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది..!!

Rashmika Mandanna’s net worth, How rich is she?

Sai Pallavi Replaced by Keerthy Suresh for ‘yellamma’!