in

Sreeleela to feature in special song for Allu Arjun’s ‘Pushpa 2!

ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ చిత్రం మరో వైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోయే హీరోయిన్‌ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌, పూజా హెగ్డే, సమంత ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేక గీతంలో కథానాయిక శ్రీలీల నర్తించబోతున్నట్లుగా మేకర్స్‌ అఫీషియల్‌గా తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌న విడుదల చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీని అందిస్తున్నట్లుగా తెలిసింది. ‘పుష్ప ది రైజ్‌’ చిత్రంలో సమంత చేసిన ఊ అంటావా.. మామా ఊఊ అంటావా ఐటెమ్‌సాంగ్‌ ఎంతటి పాప్యులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు..!!

Samantha shifts focus from commercial films to challenging roles!

Regina faced several challenges while getting into Bollywood!