in

sreeleela to do a special song in chiranjeevi anil ravipudi film?

చిరు–శ్రీలీల కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎనర్జీతో ఉండే శ్రీలీల ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో యూత్‌లో డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో ఊపే అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. చిరు స్టైల్ బ్రేక్ డ్యాన్స్‌కు శ్రీలీల గ్లామర్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తోడైతే, ఆ స్పెషల్ సాంగ్ థియేటర్లలో టపాసులా పేలుతుందని చెప్పకనే చెప్పాలి.

ఈ పాటకు మాస్ బీట్స్‌లో ప్రత్యేకం అయిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, శ్రీలీల కోసం ప్రత్యేకంగా స్టెప్పులు డిజైన్ చేస్తూ కోరియోగ్రఫీ కూడా గ్రాండ్‌గా ఉండబోతుందట. ఇప్పటికే షూటింగ్‌లో భాగంగా కొన్ని పార్ట్స్ రెహార్సల్స్ జరిగాయని టాక్. ఈ మూవీ చిరంజీవికి పూర్తిగా కొత్తగా ఉండేలా, అనిల్ రావిపూడి కుటుంబ కథానాయకుడిగా చూపించనున్నారని తెలుస్తోంది..!!

pooja hegde about high and lows in cinema career!