in

sreeleela reveals shocking things about her childhood!

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇలా వరుసగా భారీ పాపులారిటీ దక్కించుకోవడం నిజంగా సీనియర్ హీరోయిన్లకు కూడా చమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. పెద్దపెద్ద హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ఈమె గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీలీల కు సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. విషయంలో కెళితే చిన్నప్పటినుంచి శ్రీలీలను తన తల్లి చాలా కండిషన్స్ పెడుతూ పెంచిందట.

సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఇష్టం చూపుతూ ఉంటారు. అలాంటి అవకాశం తనకు తల్లి ఇవ్వలేదని…స్కూల్ అయిపోగానే ట్యూషన్.. ట్యూషన్ అయిపోగానే డాన్స్ క్లాస్.. ఆ తర్వాత యాక్టింగ్ అంటూ తనను ప్రతిక్షణం తీరిక లేకుండా బిజీగా ఉంచడంతో విసిగిపోయానని శ్రీ లీల చెప్పుకొచ్చింది. ఇక ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి దొంగ సాకులు చెబుతూ ఒక్కోసారి ఇంటిపట్టునే ఉండేదట. ఇలా స్కూల్, యాక్టింగ్ , డాన్స్ క్లాసెస్ కు వెళ్లాలి అంటే బోర్ కొట్టినప్పుడు కడుపునొప్పి అని అబద్ధం చెప్పేదట ఈ ముద్దుగుమ్మ.

Nagarjuna and Tabu jodi Reuniting again?

Man Snatches Mobile Phone From Rashmika Mandanna’s Hand!