కైకాల సత్యనారాయణ గారు గుడివాడ లో డిగ్రీ చదువుతూనే నాటకాలు వేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డిగ్రీ తరువాత రాజమండ్రిలో కలప వ్యాపారం చేస్తున్న రోజుల్లో పరిచయం అయిన, కే.ఎల్. ధర్ , ప్రసాద్ ప్రొడక్షన్స్ లో దర్శకత్వ శాఖలో పని చేసే వారు, కే.ఎల్ ధర్ ప్రోత్సాహం తో మద్రాస్ చేరుకున్న సత్యనారాయణ గారు సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. చూసిన వారందరు బాగున్నావు సినిమా కు పనికివస్తావు అని చెప్పే వారే కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఒక సంవత్సరం ప్రయత్నాలు వృధా అయి పోయాయి, ఆ సమయం లో ఒక హోటల్ లో కాఫీ తాగిన సత్యనారాయణ కు కప్ లో సాలెపురుగు కనపడింది.
అప్పటికే నిరాశ లో ఉన్న సత్యనారాయణ తాను రేపు ఉదయానికి బ్రతికి ఉంటె తనకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు లేదంటే లేదు అనుకోని, నేరుగా రూమ్ కి వెళ్లి పడుకుండిపొయారు. మరుసటి రోజు నిద్రలేచిన సత్యనారాయణ గారు తనకు ఏమి కాలేదంటే తనకు మంచి రోజులు ముందున్నాయి అనుకోని, రెట్టించిన ఉత్సాహం తో ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిర్మాత డి.ఎల్.నారాయణ గారు ఏదో సినిమా తీస్తున్నారు అని తెలుసుకొని వారిని కలిశారు, వారు తీయబోతున్న ” సిపాయి కూతురు ” చిత్రం లో ఏకం గ హీరో పాత్రకు ఆయనను తీసుకున్నారు..