in

south queens nayanthara and samantha develop special friendship!

ద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు వారి మధ్య ఈగో క్లాష్‌లు వస్తాయని అందరూ అనుకుంటారు. అయితే నయనతార, సమంతల విషయంలో మాత్రం అలా కాదు. కథు వాకుల రెండు కాదల్ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సామ్, నయన్‌లు మంచి ఫ్రెండ్స్ అయ్యారట..కాగా మంగళవారం రాత్రి సమంత నయన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆమె సోషల్ మీడియాలో లేదు కానీ ఆమె తన ప్రేమను మీకు పంపుతోంది అంటూ కాప్షన్ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక రొమాంటిక్ కామెడీగా రూపొందిన కథు వాకుల రెండు కాదల్ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

big boss beauty Ashu Reddy trolled for wearing torn jeans!

‘mirapakai’ heroine Deeksha Seth Latest Photoshoot Stills!