in

South Actress Namitha’s desire to Join Politics!

క‌ప్పుడు కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించిన క‌థానాయిక న‌మిత‌. బొద్దుగా.. ముద్దుగా.. క‌నిపిస్తూ, రొమాంటిక్ చూపుల‌తో యువ‌త‌రం హృద‌యాల్ని దోచుకొంది. కొంత‌కాలంగా న‌మిత‌కు సినిమాల్లేవు. ఇప్పుడు రాజ‌కీయాల వైపు దృష్టి సారించ‌బోతోంది. ఈ విష‌యాన్ని న‌మిత స్వ‌యంగా వెల్ల‌డించింది. ఆదివారం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం తిరుపతి వ‌చ్చింది న‌మిత‌. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడింది. త‌న‌కు ప్ర‌స్తుతం సినిమాల‌కంటే రాజ‌కీయాల‌పైనే ఎక్కువ ఆసక్తి ఉంద‌ని..

అందుకే.. తాను పాలిటిక్స్ పై ఫోక‌స్ చేయ‌బోతున్నాన‌ని చెప్పుకొచ్చింది. అయితే ఏ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తుందో మాత్రం వెల్ల‌డించ‌లేదు. న‌మిత‌కు పెళ్ల‌యి, ఇద్ద‌రు పిల్ల‌లు. ఆ పిల్ల‌లు ఇటీవ‌ల అనారోగ్యానికి గుర‌య్యారు. వాళ్లకు న‌యం అయితే.. తిరుమ‌ల వ‌స్తాన‌ని న‌య‌న మొక్కుకుంద‌ట‌. ఆ మొక్కు తీర్చుకోవ‌డానికి తిరుప‌తి వ‌చ్చింది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ తార‌ల పాత్ర కీల‌క‌మైన‌దే. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. అక్క‌డ సినీ గ్లామ‌ర్ క‌నిపిస్తుంటుంది. న‌మిత‌కు పార్టీలు సీటు ఇస్తాయో లేదో తెలీదు గానీ..ఈసారి ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం న‌మిత‌న చూడొచ్చు..!!

varsha bollamma denies marriage rumors with producer’s son!

Excessive workouts the reason for Samantha’s condition?