సోహెల్, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీ కోనేటి దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా మిర్యాల రవీందర్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘కుటుంబ విలువలే ప్రధానంగా సాగే వినోదభరిత కథాంశమిది.
బూట్‌కట్ బాలరాజుగా సోహెల్ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ఫిబ్రవరిలోగా షూటింగ్ పూర్తిచేస్తాం’ అని తెలిపారు. “బిగ్‌బాస్’ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అంగీకరించిన రెండో సినిమా ఇది. నా పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది’ అని సోహెల్ అన్నారు. తెలంగాణ యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో తాను కనిపిస్తానని అనన్య నాగళ్ల చెప్పింది. రెండున్నర గంటలు నవ్వించే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు.