తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’…
ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా అంటే చివర్లో ఇప్పుడు ఐదు నిమిషాలు హీరోను మంచిగా చూపిస్తాము లేదా ఎప్పుడో నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను అంటారు. నెక్స్ట్ పార్ట్ తీసే లోపు సమాజం చెడిపోదా ? అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా? అది ఈ రోజు ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు ఒక కుర్రాడు కూడా ఎవరినైనా గూబ మీద కొట్టి తగ్గేది లేదంటున్నాడు.
దానికి ఎవరు కారణం? జరిగింది చెడు నాకు కోపం వస్తుంది. ఆ హీరోను గానీ, డైరెక్టర్ గాని సమాధానం చెప్పమనండి… అక్కడే కడిగేస్తా వాళ్ళని… ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. అసలు అలాంటి డైలాగ్ ను ఎవరు వాడాలి? శ్రీరాములు లాంటివారు వాడాలి, హారిశ్చంద్రుడి వంటివారు వాడాలి… అంతేగాని ఒక స్మగ్లర్ వాడడం ఏంటి? అంటూ గరికపాటి ఫైరయ్యారు. మరి ఆయన వ్యాఖ్యలపై ‘పుష్ప’రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.