in

Siva Koratala – story told Allu Arjun is different from Devara

అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాడు కొర‌టాల శివ‌. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ప్రీ లుక్ కూడా వ‌దిలారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగ‌లేదు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ తో ‘దేవ‌ర‌’ ప‌ట్టాలెక్కింది. అయితే ‘దేవ‌ర‌’ క‌థే… అప్ప‌ట్లో బ‌న్నీకి వినిపించార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ లో కూడా స‌ముద్రం, ప‌డ‌వ‌లూ..అలాంటి సెట‌ప్ క‌నిపించ‌డంతో ‘దేవ‌ర‌’ క‌థ‌, బ‌న్నీ క‌థ రెండూ ఒక‌టే అనుకొన్నారు. కానీ వీటిపై కొర‌టాల శివ క్లారిటీ ఇచ్చారు. బ‌న్నీ క‌థ వేర‌ని, ‘దేవ‌ర‌’ క‌థ ఎన్టీఆర్‌కి త‌ప్ప ఇంకెవ‌రికీ వినిపించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాంతో ఈ రూమ‌ర్ల‌కు చెక్ ప‌డిన‌ట్టే అనుకోవాలి..!!

house Robbery in mohan babu residence!

indonesian actress Chelsea Islan in Mahesh Babu movie?