సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్ర వేసింది. ఈ భామ నటన, అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌కు టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. తాజాగా మరో సూపర్ ఆఫర్ దక్కించుకుంది. తెలుగులో సత్తా చాటిన మృణాల్ ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి పిలుపు అందుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. చారిత్రక కథాంశంతో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో మృణాల్ అంగీకారం తెలిపిందని తెలిసింది. ఫిబ్రవరిలో ఆరంభం కానున్న కొత్త షెడ్యూల్లో ఆమె సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన రూపాల్లో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. వెట్రి ఛాయాగ్రాహకుడు..!!