in

simran to play a cameo role in mahesh babu rajamouli’s film?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ జక్కన్న మహేష్ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. చాలా రోజులుగా సిమ్రన్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో యాక్ట్ చేసింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని గౌతమ్ మీనన్ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ లో నటించింది.

మహేష్ బాబు సిమ్రన్ ఇద్దరు కలిసి ఇదివరకు ‘యువరాజ్’ సినిమాలో జోడిగా నటించారు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మహేష్ సినిమాలో సిమ్రన్ నటిస్తున్నారు. సిమ్రన్ క్రేజీ ఆఫర్ కొట్టేసింది అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. రాజ మౌళి, మహేష్ కాంబో మూవీలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో సిమ్రన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించనున్నట్టు సమాచారం. ఆమే ఇందులో ఎలాంటి క్యారక్టర్ చేస్తోంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది..!!

pooja hegde spicy item number in junior ntr’s devara?

mouni roy demands huge pay for telugu movie offer!