in

Shruti Hassan To Quit Her Acting Career!!

నటనతో పాటు సంగీతంలో కూడా చక్కటి ప్రావీణ్యాన్ని కనబరుస్తుంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్‌. కంపోజింగ్‌తో పాటు గాయనిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. సంగీతంపై ఉన్న మక్కువే తనను సినీరంగంలోకి తీసుకొచ్చిందని శృతిహాసన్‌ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కాలేజీ రోజుల్లో రాక్‌స్టార్‌ కావాలని కలలుకనేదాన్ని. సొంతంగా రాక్‌బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకున్నా. అందుకు డబ్బులు బాగా అవసరం. అందుకే సినిమాల్లోకి వచ్చాను. రెండుమూడు సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ఆ తర్వాత చిత్రసీమకు గుడ్‌బై చెబుదామనుకున్నా.

అయితే విధి మరోలా తలచింది. ఇక్కడకు వచ్చిన తర్వాత క్రమంగా సినిమాల్ని ప్రేమించడం మొదలుపెట్టా. ఓరకంగా సినీరంగం నాకు అరెంజ్డ్‌ మ్యారేజ్‌లాంటిది. మెల్లగా సినిమా ప్రేమలో పడ్డా. ఇప్పుడు ఇండస్ట్రీయే నా ప్రపంచం అయిపోయింది’ అని శృతిహాసన్‌ చెప్పింది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సంగీతాన్ని వదిలిపెట్టలేదని, విరామ సమయాల్ని మ్యూజిక్‌ కోసమే వినియోగిస్తున్నానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం శృతిహాసన్‌ తెలుగలో ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోంది.

Paagal!

SVP & Pushpa Leaks : Mythri makers Approaches Cybercrime!