సలార్ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ బ్యూటీ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా భిన్నంగా ఉంటుంది అని సమాచారం. ఆమెది ఒక జర్నలిస్టు పాత్ర అని కూడా చిత్ర యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇక గ్లామర్ విషయంలో కూడా శృతి ఈ సినిమాలో అంతకుమించి అనేలా షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక యాంగిల్ లో ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరొక యాంగిల్ లో చాలా గ్లామరస్ గా కనిపిస్తుందట. అయితే అందుకు సంబంధించిన లుక్ ను శృతి హాసన్ ఇటీవల వీడియో తో సహా సోషల్ మీడియాలో లీక్ చేసింది.
ఆమె చాలా రఫ్ లుక్ తో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గ్లామరస్ అందాలతో కూడా నెటిజన్లకు షాక్ ఇచ్చింది. శృతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మైఖేల్ కోర్సలేని వదిలేసిన తర్వాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక ప్రేమలో పడ్డారు శృతి. వీరిద్దరూ ప్రస్తుతం అక్కడ ఓకే ఇంటిలో ఉంటున్నారు. ప్రేమలు కొనసాగిస్తున్న శృతిని పెళ్లి గురించి అడిగితే కంగారు పడుతున్నారు. ఎందుకో పెళ్లంటే నాకు ఆందోళన అంటున్నారు. పెళ్లి వద్దనుకుంటే ప్రేమలు ఎందుకు అనేది అసలు సమస్య.
శృతి పేరెంట్స్ కమల్-సారిక ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయారు. ఈ కారణం చేతనే పెళ్లి వద్దనుకుంటున్నారా? అని అడిగితే కాదని సమాధానం చెబుతున్నారు. అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పటికీ కలిసి ఉన్నంత కాలం సంతోషంగా ఉన్నారు. నా భయానికి వాళ్లకు సంబంధం లేదని శృతి అంటున్నారు. ఇద్దరు కలిసి జీవించడాన్ని అధికారికం చేయడమే పెళ్లి. కలిసి జీవించడానికి, పెళ్లి చేసుకోవడానికి పెద్ద తేడా లేదు. కాకపోతే పెళ్ళైతే విడిపోవాలంటే చట్టబద్ధత కావాలి. ప్రేమలు రిలేషన్స్ లో అవేమీ ఉండవు. స్వేచ్ఛగా వద్దనుకున్నప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పుకొచ్చింది..శాంతనుతో కలిసి జీవిస్తున్న శృతి అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పక పోవడం విడ్డూరం.