in

shruthi haasan showing interest in senior heroes!

మొన్నటివరకు కుర్రహీరోల సరసన నటించింది. ఇప్పటికీ ఆమె కుర్రహీరోల హాట్ ఫేవరెట్. కానీ శృతిహాసన్ మాత్రం ఎందుకో సీనియర్ హీరోల సినిమాలకే మొగ్గుచూపుతోంది. మొన్నటివరకు రవితేజ, పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు కూడా కాల్షీట్లు ఇస్తోంది. చిరంజీవి, బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ను తీసుకున్న విషయాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా చిరంజీవి-శృతిహాసన్ కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. చిరంజీవి సినిమా కంటే ముందు బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంది శృతిహాసన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ లో జాయిన్ అయింది కూడా..ఇలా టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేస్తూ, తన కెరీర్ స్పాన్ ను తగ్గించుకుంటోంది శృతిహాసన్. రాబోయే రోజుల్లో వెంకటేష్, నాగార్జున సరసన నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Alia Bhatt to Make Her Hollywood Debut With ‘Heart of Stone’!

et!